కడప ఎస్పీ అన్బురాజన్ (Kadapa SP Anburajan )తో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత (ys viveka daughter sunitha ) భేటీ అయ్యారు. పులివెందులలోని తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో భద్రత పెంచాలని కోరారు. ఈ మేరకు ఎస్పీ అన్బురాజన్.. సానుకూలంగా స్పందించారు. వైఎస్ వివేకా (Viveka Murder Case).. హత్యకు సంబంధించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. కేసును సీబీఐ (CBI) విచారిస్తుండటంతో.. పూర్తి వివరాలు వారి వద్దే ఉంటాయని ఎస్పీ తెలిపారు. మరోవైపు వివేకా హత్య కేసులో 9వ రోజు సీబీఐ అధికారులు విచారణ కొనసాగించారు. వైకాపా కార్యకర్త కిరణ్‌కుమార్ తండ్రి కృష్ణయ్య యాదవ్‌ను ప్రశ్నించారు.
ఇదీ చదవండి