కడప జిల్లా మైదుకూరు సాయిబాబా వీధిలో నివాసముంటున్న సురేశ్ బాబు.. నాలుగేళ్ల కిందట తండ్రి, ఏడాదిన్నర క్రితం తల్లి మరణించటంతో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యం పాలైన సురేశ్.. కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. శుక్రవారం దగ్గు, ఆయాసం ఎక్కువవటంతో కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్థానికులు సూచించారు. కాగా..ఇది వరకే కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నాని.. నెగిటివ్ వచ్చిందని వారికి చెప్పాడు.
శనివారం ఉదయం సురేశ్ బాబును ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బంధువులు ఇంటికి రాగా.. తలుపులు వేసి ఉండటాన్ని గమనించారు. సురేశ్ బాబు ఎంతకీ తలుపులు తెరవకపోవటంతో బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. కానిస్టేబుల్ వచ్చి ఇంటి తలుపులు తీయించారు. కాగా..తీవ్ర అనారోగ్యంతో ఉన్న సురేశ్ బాబు కదల్లేని స్థితిలో ఉండిపోయాడు. కరోనా భయంతో అతని దగ్గరకు వెళ్లేందుకు ఎవరూ..సాహసించ లేకపోయారు. ఉదయం 9 గంటల సమయంలో గ్రామ వాలంటీర్ 108కు, అధికారులకు సమాచారమివ్వగా...11.30 గంటలకు పురపాలక కమిషనర్ సురేశ్ బాబు బాధితుడి ఇంటికి చేరుకున్నారు. కాసేపటికి ఏఎన్ఏం వచ్చి పరీక్షించి సురేశ్ బాబు చనిపోయాడని నిర్ధరించింది. అధికారుల అలసత్వం, స్థానికుల కరోనా భయంతో యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.
ఇదీచదవండి
8 నెలల గర్భిణీ అయినా.. కరోనా రోగులకు సేవలు.. ఇది కదా స్ఫూర్తి!