ETV Bharat / state

ఆటో నుంచి అద్దాలు దించుతూ.. ప్రమాదవశాత్తూ యువకుడు మృతి - young man died by lifting mirrors from auto

కడప జిల్లా మైదుకూరులో సరకులు చేరవేసే ఆటో నుంచి అద్దాలు దింపుతూ.. ప్రమాదవశాత్తు ఓ యువకుడు అవే అద్దాల కిందపడి మరణించాడు.

youngman died by lifting mirrors from auto
ఆటో నుంచి అద్దాలు దించుతూ యువకుడు మృతి
author img

By

Published : Jun 9, 2020, 8:28 PM IST

బక్క బాషా (30) అనే యువకుడు.. మంగళవారం కడప జిల్లా మైదుకూరులో ఆటో నుంచి అద్దాలు దింపుతూ ప్రమాదవశాత్తు అవే అద్దాల కిందపడి చనిపోయాడు. హార్డ్‌ వేర్‌ దుకాణం వద్ద సరకులు చేరవేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

ఆటో నుంచి అద్దాలు దింపుతుండగా ఉన్నట్టుండి బాషాపై ఒరిగిపోయాయి. గమనించిన తోటి కూలీలు, స్థానికులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. కొన్ని అద్దాలను పగులగొట్టారు. మిగిలిన వాటిని తొలగించారు. అప్పటికే బాషా మృతి చెందాడు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

అడవి నుంచి గ్రామానికి చేరిన నెమలి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.