రాష్ట్రంలో గోశాల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గోశాల అభివృద్ధి కమిటీలకు జీవో ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ ఆ కమిటీలు వేయలేదని తెలిపారు. గత ఏడాది సింహాచలం గోశాలలో 3 ఆవులు చనిపోయాయన్న రఘురామకృష్ణ రాజు.. తాడేపల్లి గోశాలలో విష ప్రయోగం వల్ల 100 ఆవులు మరణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నివర్గాలతో కలిపి గోశాల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు.
ఇదీ చదవండి