కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ నాలుగో వార్డు నుంచి వైకాపా తరఫున కౌన్సిలర్‌గా గెలిచిన జ్ఞాన ప్రసూన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇస్తానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట ఇచ్చి... ఇప్పుడు మోసం చేశారని ఆమె ఆరోపించారు.
తనకు కాకుండా 12వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన శివమ్మకు ఛైర్మన్ పదవి ఇవ్వాలని చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తే... ఎమ్మెల్యే ఎవరికైనా పదవి ఇస్తారని ఆరోపించారు. ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇంకా చాలామంది వైకాపా కౌన్సిలర్లు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె తెలిపింది.
ఇదీ చదవండి:
మైదుకూరులో తెదేపా జోరు.. ఫ్యాన్ గాలిని తట్టుకుని ఎలా సాధ్యమైంది?