అసలే ఇరుకైన దారులుండే కడపలో..వర్షాకాలానికి దెబ్బతిన్న రహదారులపై ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చిన్నపాటి వాన కురిసినా.. ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండు కూడలి, కోర్టు రోడ్డు, వై జంక్షన్, అప్సర కూడలి, ఐటీఐ కూడలి ప్రాంతాల్లో.. రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇది కడప నగరమా లేక మారమూల గ్రామమా అని ప్రజలు అనుకోవాల్సి వస్తోంది. నగరంలో 8 రహదారులకు నిధులు మంజూరైనా.. పనులు చేపట్టేందుకు నెలల తరబడి జాప్యం చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా రోజూ ఇదే రహదారులపై తిరుగుతున్నా.. పట్టించుకోవట్లేదని స్థానికులు మండిపడుతున్నారు. సీఎం జగన్ తన సొంత జిల్లాపై మరింత దృష్టి సారించి.. త్వరితగతిన రోడ్లను బాగుచేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి