ETV Bharat / state

అనుమానస్పద స్థితిలో మహిళ మృతి - కడప జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

కడపలో ఓ మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె తలపై బలమైన గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా భావిస్తున్నారు. భర్తే హత్య చేసి ఉంటాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

Woman dies
Woman dies
author img

By

Published : Dec 23, 2020, 10:53 AM IST

అన్నపూర్ణమ్మ అనే మహిళ అనుమానస్పద స్థితిలో మరణించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడపలోని ఓం శాంతి నగర్ కు చెందిన అన్నపూర్ణమ్మ, లక్ష్మయ్య ఇద్దరు.. హోమియోపతి ఆసుపత్రిలో వైద్యులు. ఇటీవల వారి కుమార్తె అనారోగ్యంతో విదేశాల్లో మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని కడపకు రప్పించేందుకు సుమారు ఐదు లక్షల వరకూ ఖర్చయింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య అప్పు విషయంలో వాగ్వాదం జరుగుతుండేది.

ఇదిలా ఉండగా.. మంగళవారం అన్నపూర్ణమ్మ తన ఇంట్లో అనుమానస్పద స్థితిలో.. రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె భర్త లక్ష్మయ్య వారి బంధువులకు ఫోన్ చేసి అన్నపూర్ణకు మూర్ఛవ్యాధి రావడంతో కిందపడి గాయాలయ్యాయని చెప్పారు. వెంటనే ఆమె బంధువులు వచ్చి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కిందపడిన గాయాలు కాదని .. ఎవరో బలంగా కొట్టడం వల్ల ఇలా జరిగిందని ధృవీకరించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

హామీ లేకుండా అప్పులిస్తారు... చెల్లించకుంటే ఆయువు తీస్తారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.