ETV Bharat / state

Illegal Affair: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య - కడప జిల్లా వార్తలు

murder-case
murder-case
author img

By

Published : Sep 25, 2021, 6:08 PM IST

Updated : Sep 25, 2021, 8:53 PM IST

18:01 September 25

CDP_wife arrest in Husband murder case_Breaking

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో ఈ నెల 17న హత్యకు గురైన జంగం శివ‌కుమార్‌ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రుద్ర‌వరం మండ‌లం కొటకొండ‌కు చెందిన జంగం శివ‌కుమార్​ అనే వ్యక్తి ప్రొద్దుటూరులో ఈ నెల 17న హత్యకు గురైయ్యాడు. మరుసటి రోజు( సెప్టెంబర్​ 18 న) కంపచెట్లలో మృత దేహం పోలీసులకు దొరికింది. కేసు న‌మోదు చేసి పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా ఈ కేసులో శివ‌కుమార్ భార్య శిశ‌క‌ళ‌, ఆమె ప్రియుడు న‌వీన్‌తో పాటు మ‌రో యువ‌కుడిని అరెస్టు చేసి రిమాండుకు త‌ర‌లించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ప్రొద్దుటూరులోని ఓ హోట‌ల్‌లో శివ‌కుమార్​ భార్య శ‌శిక‌ళ పని చేసేది. అయితే అక్క‌డే ప‌నిచేస్తున్న న‌వీన్​ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది గమనించిన హోట‌ల్ యజమాని శశికళ, నవీన్​ను పనిలో నుంచి తీసేశాడు. దాంతో వారు వేరే హోటల్​లో పనికి చేరారు. ఈ క్రమంలో వీరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం శశికళ భర్త శివకుమార్​కు తెలిసింది. శశికళను, నవీన్​ను పలుమార్లు శివకుమార్​ హెచ్చరించారు. ఫలితంగా కక్ష పెంచుకున్న శశికళ, నవీన్​.. శివకుమార్​ను చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్ర‌మంలో 17వ తేదీన న‌వీన్ మ‌రో యువ‌కుడు బహదూర్​ సర్కీ అలియాస్​ ష‌మీర్​తో కలిసి శివ‌కుమార్‌కు మ‌ద్యం తాపించారు. మత్తులో ఉన్న శివకుమార్​ను వీరిద్దరు బండ‌రాయితో కొట్టి చంపారు. మృతదేహాన్ని ఘటన స్థలానికి కొద్ది దూరంలో పడేశారు.

ఇదీ చదవండి: LIVE SUICIDE: కళ్లెదుటే భార్య ఉరి..ఆపకుండా వీడియో తీసిన భర్త

Last Updated : Sep 25, 2021, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.