ETV Bharat / state

దుబ్బాక స్ఫూర్తితో తిరుపతిలోనూ గెలుస్తాం: రమేశ్ నాయుడు - ఏపీలో భాజపా అధికారం తాజా వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైకాపా వాటికి దూరంగా ఉందని భాజపా రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు ధ్వజమెత్తారు. 18 నెలల కాలంలో వైకాపాపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కడపలో మండిపడ్డారు.

దుబ్బాక స్ఫూర్తితో తిరుపతిలోనూ గెలవాలి : రమేశ్ నాయుడు

author img

By

Published : Nov 10, 2020, 5:20 PM IST

లోకల్ బాడీ ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే వైకాపా ఎన్నికలకు దూరంగా ఉందని భాజపా రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు కడపలో ఎద్దేవా చేశారు. 18 నెలల కాలంలోనే అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత మొదలైందన్నారు.

అవ లక్షణాలు ఏపీలో తిష్ట వేశాయి..

ఇసుక మాఫియా, లిక్కర్, ఎర్రచందనం, భూ దందా, జూదం వంటి అవలక్షణాలు ఏపీలో రాజ్యమేలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికల తరహాలోనే రానున్న తిరుపతి ఎన్నికల్లో కూడా భాజపా గెలువబోతుందన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ చేతులెత్తేశారు..

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సీఎం జగన్ చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడాలేని ఎర్ర చందనం ఒక్క ఆంధ్రప్రదేశ్​లోనే ఉండటం గర్వకారణమని.. అలాంటి ఎర్రచందనాన్ని టన్నుల కొద్దీ అక్రమ రవాణా చేస్తున్నారని మండిపడ్డారు.

చర్యలు కోరతాం..

ఎర్రచందనం స్మగ్లింగ్​ను కట్టడి చేసేందుకు కేంద్రంతో చర్చించి రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన చర్యలు కోరతామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : ఆరోగ్యశ్రీ వైద్య సేవల విస్తరణ ప్రారంభించిన సీఎం జగన్‌..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.