'ఆంక్షలను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం' - కడపలో కరోనా కేసులు
కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23కి చేరడంతో... జిల్లా కేంద్రంలో పోలీసులు ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. రెడ్‌జోన్, బఫర్‌జోన్ల కింద ఆయా ప్రాంతాలను విభజించి... బయటివారెవరూ లోపలికి రాకుండా ఆంక్షలు విధించారు. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని.. ప్రజలు ఎవరూ బయటికి రావద్దని సూచిస్తున్న కడప డీఎస్పీతో మా ప్రతినిధి ముఖాముఖి.