కడప జిల్లా కమలాపురం స్థానిక ఎంపీడీఓకు వాలంటీర్లు వినతి పత్రం అందజేశారు. నగరానికి చెందిన 98 మంది వాలంటీర్లకు మూడు నెలల నుంచి మాకు గౌరవ వేతనం ఇవ్వలేదని ఆరోపించారు. జీతాలు లేక ఇల్లు గడవడం కష్టంగా ఉందని ఆవేదన చెందారు.
కొంతమంది వాలంటీర్లకు టాబ్లు, సిమ్ కార్డులు లేవని, పింఛన్ పంపిణీ కష్టంగా మారుతోందని చెప్పారు. సమస్యలు విన్న ఎంపీడీవో శివరామిరెడ్డి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: