ETV Bharat / state

Viveka letter judgment: వివేకా లేఖపై సీబీఐ..నిన్‌హైడ్రిన్ ఫోరెన్సిక్ పరీక్షకు పిటిషన్.. బుధవారం నిర్ణయం - Vivekananda Reddy murder case updates

Vivekananda Reddy murder case updates: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య సమయంలో లభ్యమైన లేఖపై నిన్‌హైడ్రిన్ ఫోరెన్సిక్ పరీక్ష జరపాలన్న సీబీఐ పిటిషన్‌పై.. బుధవారం నిర్ణయం వెలువడనుంది. ఆయన (వివేకా) మరణించే ముందు రాసిన ఆ లేఖలో నిగూఢ వేలి ముద్రలనూ గుర్తించేందుకు, నిందితులను పక్కాగా తెలుసుకునేందుకు నిన్‌హైడ్రిన్ ఫోరెన్సిక్ పరీక్ష జరపాలని సీబీఐ గతంలో కోరింది.

Viveka
Viveka
author img

By

Published : Jun 5, 2023, 10:14 PM IST

Updated : Jun 6, 2023, 11:35 AM IST

Vivekananda Reddy murder case updates: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య సమయంలో ఆయన (వివేకానంద రెడ్డి) రాసిన లేఖకు నిన్‌హైడ్రిన్ ఫోరెన్సిక్ పరీక్ష జరిపేందుకు అనుమతివ్వాలని గతకొన్ని నెలల క్రితం నాంపల్లి సీబీఐ కోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై ఈ నెల 7వ తేదీన సీబీఐ కోర్టు నిర్ణయాన్ని వెల్లడించనుంది. సీబీఐ వేసిన పిటిషన్‌పై ఇవాళ వాదనలు ముగిశాయి. తన (వివేకా) హత్యకు డ్రైవర్ ప్రసాద్ కారణమంటూ.. వివేకా రాసిన లేఖ ఆరోజున హత్యస్థలిలో లభించింది. దీంతో ఆ లేఖను పరీక్షించిన సీఎఫ్‌ఎస్‌ఎల్‌ దిల్లీ విభాగం.. తీవ్రమైన ఒత్తిడిలో వివేకానంద రెడ్డి ఆ లేఖను రాసినట్టు తేల్చింది. నిందితులు బలవంతంగా వివేకాతో ఆ లేఖ రాయించినట్లు దర్యాప్తులో సీబీఐ గుర్తించింది. అయితే, ఆ లేఖపై వివేకాతో పాటు ఇంకా ఎవరెవరి వేలిముద్రలు ఉన్నాయో.. గుర్తించేందుకు నిన్‌హైడ్రిన్ పరీక్ష జరపాలని సీబీఐ భావించింది.

వివేకా లేఖపై ఈనెల 7న తీర్పు.. మరోపక్క ఆ పరీక్ష వల్ల లేఖపై రాత, ఇంకు దెబ్బతినే ప్రమాదం ఉందని సీఎఫ్‌ఎఫ్‌ఎల్‌ చెప్పడంతో.. నిన్‌హైడ్రిన్ ఫోరెన్సిక్ పరీక్షకు అనుమతివ్వాలని కోర్టును సీబీఐ కోరింది. ఒరిజినల్ లేఖ స్థానంలో కలర్ జిరాక్సును రికార్డులో పెట్టాలని కోరింది. ఈ క్రమంలో సీబీఐ అభ్యర్థనపై నిందితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ పిటిషన్ కొట్టివేయాలని వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు.. ఈనెల 7న తీర్పును వెల్లడిస్తామని విచారణలో పేర్కొంది. తాజాగా వివేకా హత్య కేసు విచారణ ప్రక్రియలో సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు తన న్యాయవాదులు కూడా సహకరించేలా అనుమతివ్వాలన్న సునీత పిటిషన్‌పై వాదనలు.. ఈనెల 8వ తేదీకి వాయిదా పడ్డాయి.

YS Viveka Murder Case: వివేకా రాసిన లేఖపై నిన్‌హైడ్రేట్ పరీక్షకు అనుమతించాలని సీబీఐ పిటిషన్

నిన్‌హైడ్రిన్‌ పరీక్ష అంటే..?.. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి..సీబీఐ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. వివేకానంద రెడ్డి చనిపోయే ముందు రాసిన లేఖలో నిగూఢ వేలి ముద్రలనూ గుర్తించేందుకు, నిందితులను పక్కాగా తెలుసుకునేందుకు గాను నిన్‌హైడ్రిన్‌ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, ఆ పరీక్ష నిర్వహిస్తే కాగితంపై ఉన్న ఇంకు చెరిగిపోయే అవకాశం ఉన్నందున ముందస్తు అనుమతి కోరుతూ.. సీబీఐ కోర్టులో ఇటీవల సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. నిన్‌హైడ్రిన్‌ పరీక్ష ద్వారా.. వివేకా రాసిన లేఖలో ఆయన చేతిరాతతోపాటు కంటికి కనిపించని, సాధారణ పరీక్షల్లో బయటపడని వేలి ముద్రలను గుర్తించేందుకు ఈ పరీక్షను సీబీఐ అమల్లోకి తీసుకొచ్చింది.

Viveka case: వివేకా హత్య కేసుపై విచారణ.. జూన్ 16కు వాయిదా వేసిన సీబీఐ కోర్టు

వివేకా లేఖలో ఏం రాశారు..?.. అయితే, వివేకానంద రెడ్డి రాసిన ఆ లేఖలో డ్రైవర్‌ ప్రసాద్‌ తన (వివేకా) హత్యకు కారణమని, వదిలి పెట్టరాదంటూ చనిపోయే ముందు ఆయన లేఖ రాసినట్టు అధికారులు తెలిపారు. ఆ లేఖను ఏపీ హైకోర్టు ఉత్తర్వులతో 2020 జులై 9న సీబీఐ స్వాధీనం చేసుకుని.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. దాన్ని 2021 అక్టోబరులో దిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (సీఎఫ్‌ఎస్‌ఎల్‌)కు పంపుతూ.. వివేకా ఈ లేఖను ఇష్టపూర్వకంగా రాశారా..? లేదంటే ఒత్తిడితో, బలవంతంగా రాశారా..? అన్నది పరిశీలించాలని కోరింది. ఆ క్రమంలో ఆ లేఖను బలవంతంగానే రాయించినట్లు సీఎఫ్‌ఎస్‌ఎల్‌ ధ్రువీకరించింది. అనంతరం లేఖపై వివేకావి కాకుండా మరెవరివైనా వేలిముద్రలు ఉన్నాయేమో గుర్తించేందుకు నిన్‌హైడ్రిన్‌ పరీక్ష నిర్వహించి తేల్చాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ను అప్పట్లోనే కోరింది.

ఒడిశా ఘోర రైలు ప్రమాదం.. సీబీఐ దర్యాప్తునకు రైల్వే బోర్డు సిఫార్సు

Last Updated : Jun 6, 2023, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.