కడప జిల్లా బద్వేలు మండలం తొట్టిగారిపల్లెలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధులు, చంటి బిడ్డ తల్లులు అందరూ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బారులు తీరుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని... అందువల్లే జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, కలుషిత నీటి వినియోగం, దోమల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని వైద్యులు అంటున్నారు.
ఇది కూడా చదవండి.