కడప జిల్లా మైదుకూరులో ఎరువులు, పురుగు మందులు, విత్తనాల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ పురుషోత్తమరాజు, వ్యవసాయ విజిలెన్స్ అధికారి సురేషన్, స్థానిక వ్యవసాయ అధికారిని లక్ష్మీ ప్రసన్న తనిఖీలు నిర్వహించారు. అనంతరం రికార్డుల నిర్వహణలో తేడాలను గుర్తించారు. పలు ట్రేడర్స్‌లో లక్షల రూపాయల విలువ చేసే పురుగుమందులు, వరి విత్తనాల విక్రయాలను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: "ఆరోగ్యశ్రీ సేవలు అమలు చేయని... ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు"