కడప జిల్లాలో నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పథకం కింద.. లబ్ధిదారులకు ఆధునిక వాహనాలు అందించారు. కలెక్టరేట్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా హాజరయ్యారు. రూ.66 లక్షల విలువైన 3 కార్లు, రెండు మెకనైజ్ డ్రైనేజి క్లీనింగ్ మెషీన్స్, ఇంటిగ్రేటెడ్ విత్ ట్రాక్టర్ హెడ్‌ను లబ్ధిదారులకు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అందించారు.
ఎస్సీల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. పథకాలను సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని కోరారు.
ఇదీ చూడండి: