ETV Bharat / state

విద్యుదాఘాతంలో ఇద్దరు గొర్రెల కాపరులు మృతి - కడప జిల్లా ప్రోద్దుటూరు మండలంలో ఇద్దర మృతి

విద్యుదాఘాతంతో ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందిన ఘటన కడప జిల్లా రేగులపల్లిలో జరిగింది. వారితో పాటు 8 జీవాలు మృత్యువాత పడ్డాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విద్యుదాఘాతంలో ఇద్దరు గొర్రెల కాపరులు మృతి

author img

By

Published : Aug 29, 2021, 5:01 AM IST

వారికి గొర్రెల పెంపకమే జీవనాధారం. తమ వృత్తిలో భాగంగా గొర్రెలను మేతకు తీసుకెళ్లిన ఇద్దరిని విద్యుత్తు తీగల రూపంలో మృత్యువు కబళించింది. వీరితో పాటు గొర్రెలు, తోడుగా వెళ్లిన శునకం మృత్యువాత పడ్డాయి. ఓ రైతు తన పొలాన్ని పందుల నుంచి కాపాడుకునేందుకు అమర్చిన విద్యుత్తు తీగలతో జరిగిన ఈ ప్రమాదం ప్రొద్దుటూరు మండలం రేగుళ్లపల్లి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, వారి స్వగ్రామంలో విషాదం అలముకుంది.

న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు నేరవార్తలు ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లెకు చెందిన బైరగాని దస్తగిరి (42), బత్తల రామక్షుమ్మ (35) శనివారం గ్రామానికి చెందిన మరి కొందరితో కలిసి గొర్రెలు మేపేందుకు వెళ్లారు. ఈ క్రమంలో గొర్రెలు రేగుళ్లపల్లి సమీపంలోని ఏటిగట్టున పొలంలోకి వెళ్తుండగా వాటిని నిలువరించేందుకు వారిద్దరూ వెళ్లారు. పొలానికి అమర్చిన విద్యుత్తు తీగలను వారు గమనించకపోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. వీరితో పాటు 8 గొర్రెలు, కాపలాకు తీసుకెళ్లిన శునకం కూడా మృత్యువాత పడ్డాయి. ఆ ఇద్దరూ ఎంతసేపటికీ రాకపోవడంతో ఆదే గ్రామానికి చెందిన మరో మహిళ వెళ్లి చూడగా పొలంలో వారు విగతజీవులుగా పడి ఉండడాన్ని గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే కుటుంబసభ్యులు, గ్రామస్థులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. సమాచారమందుకున్న గ్రామీణ ఎస్‌.ఐ.అరుణ్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ. తెలిపారు. దస్తగిరికి భార్య మళ్లీశ్వరి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా, రామలక్షుమ్మకు భర్త నాగయ్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

దస్తగిరి(పాతచిత్రం)

రైతు నిర్లక్ష్యంతోనే ప్రమాదం
రేగుళ్లపల్లికి చెందిన రైతు బాబు తన మూడెకరాల్లో వేరుసెనగ సాగు చేస్తున్నాడని, పందులు రాకుండా విద్యుత్తు తీగలు అమర్చినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్తు తీగలను భూమిలో వదిలేయడమే కాకుండా పగటి వేళల్లోనూ విద్యుత్తు సరఫరా చేయడంతోనే ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన అతడిపై చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

.

.

ఇదీ చదవండి:

సత్తెనపల్లిలో దారుణం.. తల్లీకుమార్తెల హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.