అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఎర్రచందనం దుంగలతో పాటు.. తమిళనాడుకు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు రైల్వేకోడూరు అటవీశాఖ అధికారులు తెలిపారు. కడప జిల్లా కె.వి.బావి పరిధిలోని మట్లకోన వద్ద నిందితులను పట్టుకున్నట్లు ఎఫ్ఆర్వో నయూమ్ ఆలీ వెల్లడించారు. 125 కేజీల బరువున్న దుంగల విలువ.. ప్రభుత్వ లెక్కల ప్రకారం 50 వేల రూపాయలు ఉంటుందని స్పష్టం చేశారు.
డీఎఫ్వో ఆదేశాలతో సబ్ డీఎఫ్వో, కోడూరు అటవీ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించామని నయూమ్ తెలిపారు. నిందితులు తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలై జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించామన్నారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు, వంట సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: