Illegal Diesel Transport In Kadapa : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు సస్పెండ్‌కు గురయ్యారు. బయోడీజిల్‌తో పాటు కర్ణాటక నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న డీజిల్‌పై చర్యలు తీసుకోని కారణంగా.. సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణా సీఐ మధుసూదన్ గౌడ్, ఏఎస్ఐ అహ్మద్ బాషాను వీఆర్‌కు పంపిస్తున్నట్లు వివరించారు.
ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణా పరిధిలో బయోడీజిల్, కర్ణాటక డీజిల్ దిగుమతి వ్యవహారంలో ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలలో భాగంగా ఇద్దర్ని సస్పెండ్ చేయగా.. మరో అధికారిపై కూడా వేటు పడే అవకాశం ఉందనీ పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రొద్దుటూరుకు చెందిన కొందరు పొరుగు రాష్ట్రాల నుంచి బయోడీజిల్, డీజిల్ అక్రమంగా దిగుమతి చేసుకుని పెద్ద ఎత్తున విక్రయాలు జరుపుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో లీటరుపై 10 రూపాయలు తక్కువ ఉండటంతో ట్యాంకుల కొద్ది అక్రమంగా దిగుమతి చేసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
ఈ అక్రమ దిగుమతిపై పోలీసులకు సమాచారం అందటంతో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో వేల లీటర్ల కర్ణాటక డీజిల్ పట్టుబడింది. ఈ పట్టుబడిన అక్రమ డీజిల్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ అక్రమ నిల్వలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో అధికారులు.. ఈ చర్యలకు పూనుకున్నట్లు సమాచారం.
అసలేంటీ ఈ అక్రమ డీజిల్ కథ : సులభంగా డబ్బులు సంపదించాలని అనేక అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రొద్దుటూరులో మాత్రం అక్రమ డీజిల్‌కు తెరలేపారు అక్రమార్కులు. కర్ణాటక నుంచి కొన్ని నెలలుగా డీజిల్ దిగుమతి చేసుకుని.. దానిని ఏపీలోని రేటుకు విక్రయిస్తూ లాభాలను అర్జిస్తున్నారు. లక్షలాది లీటర్ల డీజిల్‌ను ఎలాంటి రశీదులు లేకుండా దిగుమతి చేసి విక్రయించి.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ ప్రాంతంలో సిమెంటు లారీలు, బస్సులు రాకపోకలు అధికంగానే ఉన్నాయి. దీంతో ఇక్కడ డీజిల్‌కు డిమాండ్ కూడా అధికంగానే ఉంది. డీజిల్ మాత్రమే కాకుండా.. బయోడీజిల్ దందాకు కూడా తెర లేపారు. ఎలాంటి అనుమతులు లేకుండా దీని విక్రయం కూడా సాగుతోందనే ఆరోపణలున్నాయి.
ఇవీ చదవండి :