కడప జిల్లా రాజుపాలెం మండలం వాసుదేవపురంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తూ కేసీ కాల్వలో పడి మృతి చెందారు. వారిని ఇరగం రెడ్డి రాధ (9), మల్లీశ్వరి (12)గా గుర్తించారు. పశువుల మేత కోసం వెళ్లి కేసీ కాలువలో ప్రమాదవశాత్తు పడ్డారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు మృత్యువాత పడటంతో వాసుదేవపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న తెదేపా ప్రొద్దుటూరు నియోజకవర్గ బాధ్యుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి.. వాసుదేవ పురానికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు.
ఇదీ చదవండి: