ఇవి కూడా చదవండి:'పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటాం'
ఆటోలు ఢీ.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు - కడప జిల్లా కమలాపురం మండలం నసంతపురం
కడప జిల్లా కమలాపురం మండలం నసంతపురం వద్ద విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఆటోలో కమలాపురానికి వెళుతున్న విద్యార్థుల ఆటోని.... ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
విద్యార్థి మృతి పట్ల రోధిస్తున్న తల్లిదండ్రులు
కడప జిల్లా కమలాపురం మండలం నసంతపురంలో రోడ్డు ప్రమాదం.. ఓ విద్యార్థిని బలితీసుకుంది.పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఆటోలో కమలాపురానికి వెళుతున్న విద్యార్థుల ఆటోని.. ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొట్టింది. ఈఘటనలో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను కడప రిమ్స్‌కి తరలించారు.మృతి చెందిన విద్యార్థి యర్రబల్లి కొత్తపల్లికి చెందిన విష్ణువర్దన్ రెడ్డిగా గుర్తించారు. గాయపడిన వారిలో ఆటో డ్రైవర్ రాయుడు, విద్యార్థులు నవ్యశ్రీ, కిషోర్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి:'పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటాం'