పసుపు రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పసుపు క్వింటాల్ రూ.6,850 మద్దతు ధరతో కొనుగోలు చేస్తోంది. గ్రామ వాలంటీర్ల ద్వారా కడప జిల్లాలోని పసుపు రైతులకు టోకెన్లు ఇంటింటికి పంపిణీ చేశారు. కడప, రాజంపేట, మైదుకూరు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పసుపు కొనుగోళ్లు ప్రారంభించారు. చెన్నూరు, సీకే దిన్నె మండలాలకు చెందిన రైతుల నుంచి పసుపు కొన్నారు. రెండు రకాలుగా పండించే పసుపు నాణ్యతను డీసీఎంఎస్, మార్క్ ఫెడ్, ఉద్యానశాఖ అధికారులు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 7 వేల మంది రైతులకు సంబంధించిన 10 వేల ఎకరాల్లో సాగు చేసిన పసుపును ప్రభుత్వం కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
కాటాదారుల ఆందోళన
మార్కెట్ యార్డులో పనిచేసే కాటాదారులు ఆందోళన చేశారు. గుర్తింపు కార్డులు కల్గిన తమను కాదని... డీసీఎంఎస్ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో పసుపు తూకాలు వేయిస్తున్నారని ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు.
30 క్వింటాళ్లే...
ఒక్కో రైతు నుంచి కేవలం 30 క్వింటాళ్లు మాత్రమే కాకుండా పండించిన మొత్తం పంటను కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి...రెడ్జోన్లో ఆ ఐదు జిల్లాలు...!