కడప జిల్లా దేవునికడపలో జరిగిన అగ్నిప్రమాదానికి పసుపు దగ్దమైంది. మార్కెట్ యార్డ్ సమీపంలోని ప్రైవేట్ పసుపు గ్రేడింగ్ యూనిట్లో ఈ ప్రమాదం జరిగింది. గ్రేడింగ్ చేసిన పసుపు బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 350 క్వింటాళ్ల పసుపు బస్తాలు కాలిపోయాయి. 2 అగ్నిమాపక వాహనాలతో మంటలు అదుపు చేశారు. దుర్ఘటనలో సుమారు 20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. విద్యుదాఘాతం వలనే ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ సిబ్బంది పేర్కొన్నారు.
ఇదీ చదవండి