జగన్ మంత్రివర్గ కూర్పు చూస్తుంటే ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమా గుర్తువస్తోందంటూ... రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి కడప జిల్లా వేంపల్లిలో ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగంలో అసలు ఉపముఖ్యమంత్రి అనే పదవే లేదనీ.. అలాంటిది ఐదుగురికి కట్టబెట్టారన్నారు. వారికి ఎలాంటి ప్రత్యేక ప్రొటోకాల్ అధికారాలు ఉండవన్నారు. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఈ పదవిని ఆరో వేలితో పోల్చారని గుర్తు చేశారు. కేవలం నేతలను సంతృప్తి పరచడానికే జగన్ ఐదుగురికి ఈ పదవిని ఇచ్చారని అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి..