ఇదీ చదవండీ... పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టులో జనసేన పిటిషన్
'సొంత కుటుంబానికే న్యాయం చేయని సీఎం.. రాష్ట్రానికి ఏం చేస్తారు..?' - Tulasi Reddy comments on Jagan
ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం దారుణమని.. ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హత్య కేసును సీబీఐకి ఇవ్వాలన్న జగన్.. అధికారంలోకి రాగానే ఎందుకు సిట్‌కు అప్పగించారని ప్రశ్నించారు. సొంత కుటుంబానికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి... రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని నిలదీశారు. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండానే పరిటాల రవి హత్య కేసులాగానే.. వివేకానంద కేసును చేస్తారేమోనని అనుమానంగా ఉందన్నారు.
ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి
ఇదీ చదవండీ... పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టులో జనసేన పిటిషన్