Tulasi Reddy On Vishaka Railway Zone: ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. విశాఖపట్నానికి రైల్వేజోన్ ఇచ్చేది లేదని పార్లమెంటులో కేంద్రం ప్రకటించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. విశాఖకు రైల్వేజోన్ వస్తుందని ప్రకటించిన ప్రధాని మోదీ.. ఇప్పుడు మాట తప్పుతున్నారన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను నెరవేర్చకపోవటం ఏంటని ప్రశ్నించారు.
వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను దోచుకునే పథకానికి తెరతీసిందని తులసిరెడ్డి మండిపడ్డారు. దశాబ్ధాల కిందట పేదలు నిర్మించుకున్న ఇళ్లకు ఓటీఎస్ పేరుతో ఇప్పుడు డబ్బులు వసూలు చేసే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారన్నారు. వన్‌టైం దోపిడీ పథకంగా ఓటీఎస్ మారిందని ఎద్దేవా చేశారు.
కాలు విరగటంతో రెండున్నర నెలలు ఇంటికే పరిమితమైన తులసిరెడ్డి..ఇవాళ కడప నగరంలోని ఇందిరా భవన్‌కు వచ్చారు. హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన సైనికులకు పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటించారు.
ఇదీ చదవండి