కడప జిల్లా చక్రాయపేట గండి వీరాంజనేయ దేవస్థానాన్ని తిరిగి తితిదే పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2007-2015 వరకు అభివృద్ధి కార్యకలపాలన్నీ తితిదే పర్యవేక్షించింది. అనంతరం దేవాదాయశాఖకు మారుస్తూ అప్పటి తెదేపా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ తితిదే పరిధిలోనే కొనసాగించేలా మార్పులు చేసింది. శ్రావణమాసంలో ప్రతి శనివారం ఈ గుడిలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆగస్టు 3 నుంచి జరగబోయే ఈ వేడుకలను ఈ ఏడాది తితిదే నిర్వహించనుంది.
ఇదీ చదవండి.. పుష్పాగుచ్చాల ఖర్చు తక్కువ ... ఆకర్షణ ఎక్కువ