కడపలో పార్కింగ్ చేసిన ఓ టిప్పర్ వాహనాన్ని వారం రోజుల కిందట గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు కడప శివారులో ఓ టిప్పర్లో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులపై అనుమానం రాగా వారిని వాహనానికి సంబంధించిన పత్రాలు అడిగారు. వారి వద్ద వాహనానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వారిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో టిప్పర్ను తామే దొంగిలించినట్లు నేరాన్ని ఒప్పుకున్నారని.. వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీచదవండి