ETV Bharat / state

ఎర్రచందనం అక్రమ రవాణా.. ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు - red sandal smuggling latest news update

ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. బస్వాపురం సమీప లంకమల అటవీ ప్రాంతంలో ఏడు లక్షలు విలువ చేసే 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

three red sandal smugglers arrested
అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Dec 16, 2020, 8:39 AM IST

కడప జిల్లా మైదుకూరు మండలం బస్వాపురం సమీప లంకమల అటవీ ప్రాంతంలో ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ విజయకుమార్ తెలిపారు. ఎర్రచందనం అక్రమరవాణాపై అందిన సమాచారంతో ఎస్సై రమణయ్య, అటవీశాఖ ప్రాంతీయ అధికారి గురుచరణ్‌లు వారి సిబ్బందితో కలసి తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. అక్రమ రవాణాకు సిద్ధం చేసిన పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని.. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులు జాండ్లవరం గ్రామానికి చెందిన మాచుపల్లి శ్రీనివాసులు, జంగంపల్లె గ్రామానికి చెందిన నానుబాల రాముడు, నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పేర్నపాటి మస్తాన్‌లగా గుర్తించినట్లు వివరించారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ రూ. 7లక్షలు వరకు ఉంటుందని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.