కడప జిల్లా నందిపల్లె పల్లె వద్ద ఆటో ప్రమాదం జరిగింది. బద్వేలు నుంచి బయలు దేరిన ఆటోను.. గ్యాస్ సిలిండర్ లోడ్‌తో వెళ్తున్న వాహనం ఢీ కొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులు బ్రహ్మంగారి మఠానికి చెందిన వారు.
ఇదీ చదవండి... నిషేదిత గుట్కా, ఖైనీ పట్టివేత