ETV Bharat / state

చరిత్రకు ఆనవాళ్లు..ఈ పురాతన కట్టడాలు - జమ్మలమడుగులో పురాతన చర్చి

నాటి పురాతన కట్టడాలు చరిత్రకు ఆనవాళ్లు. తరాలు మారుతున్నా ఏమాత్రం చెక్కు చెదరకుండా బలిష్టంగా ఉన్న కట్టడాలు. అలాంటి చరిత్రకు చిహ్నమైన ఓ అపురూప కట్టడమే కడప జిల్లా జమ్మలమడుగులోని చర్చ్​ . ఆంగ్లేయుల ఆధ్వర్యంలో కట్టిన ఈ పురాతన కట్టడంలో నేటికి అదే రాజసం ఉట్టి పడుతోంది.

oldest church
చరిత్రకు ఆనవాళ్లు పురాతన కట్టడాలు
author img

By

Published : Dec 23, 2020, 10:06 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో నిర్మించిన అతి పురాతన చర్చి నేటికీ చెక్కు చెదరలేదు. ఈ నిర్మాణం జరిగి 119 ఏళ్లు అవుతున్నా అదే రాజ ఠీవితో అలరారుతోంది. 1901లో చర్చి నిర్మాణానికి పునాదులు వేశారు. 1907లో నిర్మాణం పూర్తికాగా 1910లో క్యాంప్ బెల్ దొర తమ్ముడు సిడ్నీ నికల్సన్ ప్రారంభించారు. ఈ చర్చి నిర్మాణం శిలువ ఆకారంలో ఉండడం విశేషం. లోపలి పైకప్పు నిర్మాణానికి రంగూన్ టేకును వాడినట్లు నిర్వాహకులు చెబుతారు.

చర్చిలో ఉపయోగిస్తున్న ప్రసంగ వేదికను ఇంగ్లాండ్ నుంచి 1876 లో తెప్పించారు. ఇలా ఈ కట్టడం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. ఏటా ఇక్కడ క్రిస్మస్​తో పాటు, నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఎంతో అపురూపంగా తీర్చిదిద్దిన ఈ సుందర నిర్మాణం నేటికీ ఆకర్షణీయంగా ఉంది.

ఇదీ చదవండీ...తండ్రి అడుగు జాడల్లో తనయుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.