వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం
జమ్మలమడుగులో మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్ ప్రమాణ స్వీకారం - new Chairman of the Market Committee at Jammalamadugu news
కడప జిల్లా జమ్మలమడుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్‌గా వైకాపా నేత గురివిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌తో పాటు మరో 20మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి రత్నరాజు వీరిచే ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఛైర్మన్ మాట్లాడుతూ...రైతులకు అందుబాటులో ఉంటూ...సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం
వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం
ఇదీ చదవండి:
రెవెన్యూ స్వాధీనంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం భూములు