ETV Bharat / state

పూరి గుడిసెలోనే వైద్యం... నిత్యం ప్రకృతితో మమేకం - nature lover

దంత సమస్యలతో ఆ వైద్యుడి వద్దకు వెళ్లిన వారికి పూరి గుడిసెలోనే చికిత్స చేస్తాడు. ట్యాబ్​లెట్స్​కి బదులుగా చిరుధాన్యాలు, సాములు, ఊదర్ల బియ్యం వంటివి తినాలని సూచిస్తాడు. అంతేకాకుండా చిన్నారులకు కొత్త తరహా విద్యను సైతం అందించేందుకు కృషి చేస్తున్నాడు. కాంక్రీట్ ప్రపంచానికి దూరంగా పూర్వీకుల నాటి జీవనశైలిని అవలంబించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ప్రకృతి ప్రేమికుడు
author img

By

Published : Sep 18, 2019, 8:03 AM IST

ఆ వైద్యుడు... ప్రకృతి ప్రేమికుడు

కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని థామస్ హాస్పిటల్​కు నియోజకవర్గంలో మంచి పేరుంది. అబ్రహం థామస్ ఇక్కడ పదేళ్ల నుంచి దంత వైద్యులుగా పని చేస్తున్నారు. ఈయన తండ్రి, తాత కూడా ఇదే హాస్పిటల్​లో వైద్యులుగా సేవలందించారు. ప్రకృతి ప్రేమికుడైన డాక్టర్ అబ్రహం... పూర్వీకుల జీవనశైలికి ఆకర్షితులయ్యారు. హాస్పిటల్ ఎదురుగా ఉన్న తమ సొంత స్థలంలో ఔషద మొక్కలు పెంచుతున్నారు. పూర్వీకుల మాదిరిగానే రాళ్లు, మట్టితో ఓ పూరిల్లు నిర్మించుకుని... రోగులకు అందులోనే దంత చికిత్స చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే వారికి పాతకాలపు ఆహారపు అలవాట్లపై, అప్పటి జీవనశైలిపై అవగాహన పెంచుతున్నారు. సమైక్య పేరుతో ఆసుపత్రి ప్రాంగణంలోనే ఓ దుకాణాన్ని ఏర్పాటు చేసి రాగులు, సజ్జలు, సాము బియ్యం, ఊదర్ల బియ్యం వంటి వాటిని విక్రయిస్తున్నారు. వీటిని నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా వ్యాధులు దరిచేరవని థామస్ సూచిస్తున్నారు. అదే ప్రాంగణంలో చిన్న కొలను ఏర్పాటు చేసి తామర చెట్లను పెంచుతున్నారు. ఇలాంటి కొలనుల్లో స్నానం చేస్తే చర్మవ్యాధుల సమస్య ఉండదని అంటున్నారు.

చిన్నారులకు కొత్త తరహా బోధనా
వైద్యంతో పాటు విద్యా బోధనలోనూ డాక్టర్ అబ్రహం ప్రత్యేకతను చాటుతున్నారు రైల్వే కోడూరులో లీలా లెర్నింగ్ పేరుతో స్కూల్ ఏర్పాటు చేసి.. పిల్లలకు కూచిపూడి, ఒడిసి వంటి సంప్రదాయ కళలు, సంగీతాన్ని నేర్పిస్తున్నారు. చిన్నారుల ఆసక్తిని గమనించి వారికి కావాల్సిన రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఇక్కడికి రప్పించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పూర్వీకుల జీవనశైలి, ప్రకృతి పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు డాక్టర్ అబ్రహం థామస్ ప్రయత్నిస్తున్నారు.

Intro:ap_atp_61_17_ryalie_ob_kodela_death_avb_ao10005
_____________*
కోడెల మృతికి సంతాపంగా ర్యాలీలు, నిరసనలు...
-----------*
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి సంతాప సూచకంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని అన్ని మండలాల్లోనూ ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఉమామహేశ్వరనాయుడు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ పాలనను ఎండగట్టారు. ప్రస్తుత ప్రభుత్వ పాశవిక చర్యలను కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తీవ్రంగా ఆరోపించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో మాజీ జడ్పిటిసి సభ్యుడు రామ్మోహన్ మాట్లాడుతూ కోడెల శివప్రసాద్ మృతి పార్టీకి తీరని లోటని మంచి నాయకుని పోగొట్టుకుంటాడని సంతాపం వ్యక్తం చేశారు. అన్ని మండలాలను సంతాప కార్యక్రమాలతోపాటు ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.