రాష్ట్రంలో వైకాపా భయానక వాతావరణం సృష్టిస్తోందని తితిదే మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడప జిల్లా మైదుకూరులోని తెదేపా కార్యాలయంలో సూచించారు. పోలీసుల వేధింపులతోనే కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. పోలీస్ అధికారులపై మొక్కుబడిగా కేసు నమోదు చేశారే తప్ప కఠిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
న్యాయం అడిగితే బేడీలు వేశారు..
న్యాయం కోసం అమరావతిలో పోరాడుతున్న రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించినా.. పోలీసుల వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నామని వీడియో ద్వారా చెప్పినా చర్యలు శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
లెక్క లేకుండా పోయింది..
రైతులు, ప్రజలు అంటే సర్కార్కు లెక్క లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. వత్తాసు పలకడం మంచిది కాదని హితవు పలికారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఇవీ చూడండి : జర్నలిస్ట్ నుంచి ప్లీడర్ దాకా.. కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు రఘునందనమే