Fight Between TDP And YSRCP In Proddatur : మీడియా..సోషల్ మీడియా.. దీని ప్రభావం అంతా ఇంతా కాదు. ప్రపంచాన్నే చుట్టేస్తుంది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు తమ పార్టీ కార్యక్రమాలు ప్రజలకు తొందరగా, ఎక్కవ మంది చేరవేయడానికి సోషల్ మీడియాను విరివిగా వాడతారు. సోషల్ మీడియా ప్రతి ఫ్లాట్ ఫామ్ అకౌంట్ కలిగి ఉంటారు. వారిలో కొందరు దానిని మంచికి ఉపయోగిస్తే, మరికొందరు ఎదుటి వారిని కించపరచడానికి ఉపయోగిస్తారు. అధికార పార్టీకి వ్యతిరేఖంగా పోస్టులు పేడితే మానసికంగా, శారీరకంగా హింసిస్తారని, అక్రమంగా కేసులు బనాయిస్తారని ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ నేత టీడీపీ నాయకులకు సంబంధించిన విషయాలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఎమ్మెల్సీ ఎన్నికల వేెెెెెెెెెళ ఈ పోస్టు చేయడంతో జిల్లాలో రాజకీయ దుమారం రేగింది. ఇక ఏముంది. ఒక్కసారిగా నిప్పు రాజేసుకుంది. అర్ధరాత్రి ప్రొద్దుటూరు పట్టణం ఉలిక్కిపడింది.
అప్రమత్తమైన పోలీసులు : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణం ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఒక్కసారిగా అర్థరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ కౌన్సిలర్లకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తను వైఎస్సార్సీపీ నాయకుడు అగ్గారపు శ్రీనివాసులు తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతోనే ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టడంతో వివాదం సర్దుమనిగింది.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..ఆరోపణలు : ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నాయకుడు అగ్గారపు శ్రీనివాసులు ఒకటో పట్టణ ఠాణాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన అనుచరులు స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్నారు. స్టేషన్ వద్ద మళ్లీ గొడవ జరుగుతుందని భావించిన పోలీసులు అక్కడ ఎవరినీ ఉంచకుండా చెదర గొట్టారు. టీడీపీకీ సంబంధించిన ఓ నాయకుడు, అతని అనుచరులు తనపై దాడి చేశారని, చొక్కా మొత్తం చించేశారనీ శ్రీనివాసులు ఆరోపించారు. అయితే గొడవ చోటు చేసుకోవడానికి పూర్తి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పట్టణ సీఐలు తమ సిబ్బందితో కలిసి ఆర్ట్స్ కాలేజీ రోడ్డుకు వెళ్లి అక్కడ ఆరా తీశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇవీ చదవండి