ETV Bharat / state

కడపలో తెరుచుకున్న దేవాలయాలు - Srilakshmi Meenkateswara Swamy Temple in Kadapa

కడపలో దేవాలయాలు తెరుచుకున్నాయి. దాదాపు రెండున్నర నెలల తరువాత భక్తుల దర్శనాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. తీర్థప్రసాదాలను మాత్రం నిషేధించారు.

kadapa district
కడపలో తెరుచుకున్న దేవాలయాలు
author img

By

Published : Jun 8, 2020, 1:19 PM IST

Updated : Jun 8, 2020, 7:10 PM IST

తిరుమల తిరుపతి తొలి గడప దేవుని కడపలోని శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయం తలుపులు రెండున్నర నెలల తర్వాత తెరుచుకున్నాయి. లాక్ డౌన్ దృష్ట్యా దాదాపు రెండున్నర నెలలపాటు ఆలయాలను మూసివేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటిస్తూ.. ఆలయాలను పునఃప్రారంభించారు.

మొదటి రోజు కావటంతో ఆలయానికి భక్తుల తాకిడి అంతగా లేదు. స్వామి దర్శనానికి వచ్చే వారికి తీర్థ ప్రసాదాలు అందించబోమని దేవాలయ పాలకమండళ్లు స్పష్టం చేశాయి. భక్తులు నిబంధనలు పాటించాలని అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.

జిల్లాలోని చక్రాయపేట మండలం మారేళ్ల మడకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గండి వీరాంజనేయ స్వామి ఆలయం తెరుచుకుంది. నేడు, రేపు ఆలయ సిబ్బందికి, స్థానికులకు మాత్రమే దర్శనం కల్పిస్తూ అధికారులు ట్రయల్​రన్ నిర్వహించారు. 10వ తేదీ నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని తెలిపారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు తమ వెంట ఆధార్ కార్డ్, గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి..

శ్రీవారి దర్శనం.. మాస్క్​లు, భౌతిక దూరం తప్పనిసరి

Last Updated : Jun 8, 2020, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.