ETV Bharat / state

అమెరికాలో కరోనాతో ప్రవాసాంధ్రుడు మృతి - ఎన్ఆర్​సీ నాయుడు మృతి

కరోనాతో ప్రవాసాంధ్రుడు ఎన్ఆర్​సీ నాయుడు మృతి చెందారు. కడప జిల్లాకు చెందిన ఆయన.. కొవిడ్ బారిన పడి చనిపోయినట్లు తానా మాజీ అధ్యక్షుడు సతీశ్ తెలిపారు. నాయుడు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

ఎన్ఆర్​సీ నాయుడు
telugu nri nrc naidu
author img

By

Published : May 16, 2021, 4:11 AM IST

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉంటున్న ప్రవాసాంధ్రుడు కరోనాతో మృతి చెందారు. కడప జిల్లా పుల్లంపేట మండలం పీవీజీ పల్లికి చెందిన ఎన్ఆర్​సీ నాయుడు.. కొవిడ్ బారిన పడి చనిపోయినట్లు తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీశ్‌ తెలిపారు. ఎన్ఆర్​సీ నాయుడు మృతిపట్ల తాజా అధ్యక్షుడు తాళ్లూరు జయశేఖర్, ఇతర ప్రముఖులు కోమటి జయరాం, గంగాధర్‌ సంతాపం వెలిబుచ్చారు. తానా కార్యక్రమాల్లో నాయుడు ముఖ్యపాత్ర పోషించారని, 2019 వాషింగ్టన్ డీసీలో జరిగిన కాన్ఫరెన్స్‌లో స్పాన్సర్‌షిప్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించినట్లు వివరించారు. ఎన్ఆర్​ఐ తెలుగుదేశం పార్టీకి విలువైన సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు.

ఇదీ చదవండి

ఎంపీ రఘురామ ఒంటిపై దెబ్బలు-పోలీసులు కొట్టినట్లు తేలితే.. తీవ్ర పరిణామాలు ఉంటాయన్న హైకోర్టు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.