కడప జిల్లాలో పెళ్లి పేరుతో ఎస్టీ యువతిని మోసం చేసిన నిందితులకు అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అండగా ఉండటం సిగ్గుచేటని తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఎమ్మెల్యే అనుచరుడు రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువతికి వైద్య సాయం కింద 50 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. దిశ చట్టం కింద ముగ్గురిని ఉరి తీశామని హోంమంత్రి అబద్దాలు చెప్పకుండా.. మహిళల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆమె హితవు పలికారు.
ఇదీ చూడండి: