కడపలో నివర్ తుపాన్ బాధితులకు తెదేపా ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు, దుప్పట్లను పంపిణీ చేశారు. వెయ్యి మందికి వీటికి అందించారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక సభ్యులు హరి ప్రసాద్ మాట్లాడుతూ.. వరదల్లో చిక్కుకున్న ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం బాధితులను ఏ మాత్రం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. 2001 లో ఇలాంటి వరదల వచ్చినప్పుడు అప్పటి తెదేపా ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 20 వేల రూపాయలు పరిహారం ఇచ్చినట్లు గుర్తుచేశారు.
ఇదీ చదవండి