రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోలీసులు వైకాపా నేతల కనుసన్నల్లో పని చేస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని కడపలోని పార్టీ కార్యాలయంలో అన్నారు.
నందం సుబ్బయ్య హత్య కేసులో తనకు సంబంధం లేదని ప్రమాణం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి.. మృతుడి భార్య సవాలు స్వీకరించాలని డిమాండ్ చేశారు. ప్రతి విషయానికి చంద్రబాబు, లోకేశ్‌లపై సవాల్ విసరడం వైకాపా నేతలకు పరిపాటిగా మారిందని అన్నారు.
ఇదీ చదవండి: సుబ్బయ్య హత్యతో సంబంధం లేదంటూ ఎమ్మెల్యే రాచమల్లు ప్రమాణం