రాష్ట్రంలో ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన సమయం వచ్చిందని తెదేపా కడప పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి రెండేళ్లవుతున్నా..ఇప్పటికి అమలు చేయలేదని విమర్శించారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను అర్హతను బట్టి క్రమబద్దీకరిస్తామని చెప్పి అది కూడా చేయలేదన్నారు. ఇప్పటికీ పీఆర్సీ అమలు చేయలేదన్న ఆయన గత రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకంతో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఏ హామీలు నెరవేర్చలేదన్నారు.
ఇదీచదవండి
Viveka Murder Case: వివేకా ఇంటికి సీబీఐ అధికారులు..సునీత సమక్షంలో పరిశీలన