కుందూనదిలో ప్రవహిస్తున్న వరదనీటిని సద్వినియోగం చేసుకోవటంలో కేసీకాల్వ అధికారులతో పాటు కడప జిల్లా యంత్రాంగం విఫలమైందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అన్నారు. రాజోలి ఆనకట్టను సందర్శించిన ఆయన ఎగువ కురుస్తున్న వర్షాలతో రాజోలి ఆనకట్ట వద్ద కుందు నదిలో 8000 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోందన్నారు.
వృథాగా పోతున్న నీటిని కేసీ కాల్వ పరిధిలోని చెరువులకు మళ్లించి ఉంటే ఆయకట్టు పరిధిలోని 12 చెరువుల్లోకి నీరు చేరి భూగర్భ జలాలు అభివృద్ధికి దోహదపడి సాగు, తాగునీటి సమస్యలను అధిగమించే అవకాశం ఉండేదన్నారు.
నాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాజోలి జలాశయం కోసం శంకుస్థాపన చేశారని, జలాశయం పూర్తి చేసి ఉంటే 2.95 టిఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుదన్నారు. ఇచ్చిన మాటను నిలుపుకుని జలాశయ నిర్మాణం పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు
ఇదీ చూడండి