కడప జిల్లా ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఏఎంఈఏడీ హిమ శైలజ హాజరయ్యారు. నూతన కార్యవర్గంతో ప్రమాణం స్వీకారం చేయించారు. కమిటీ ఛైర్మన్ గా.. యాలం తులసమ్మ, వైస్ ఛైర్మన్గా దొంతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి, 13 మంది సభ్యులుగా ప్రమాణం చేశారు. వారితో రిజిస్టర్లో సంతకాలు చేయించుకుని బాధ్యతలు అప్పగించారు. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గౌరవ అధ్యక్షుడిగా సంతకం చేశారు.
ఇదీ చదవండి:
పింఛన్లు పునరుద్ధరించాలని లబ్ధిదారుల ఆందోళన