కడప జిల్లా ప్రొద్దుటూరులో గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అపార్ట్మెంట్ వెనుక భాగంలో ఉన్న కంపచెట్లలో యువకుడి మృతదేహం కనిపించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. యువకుడు మృతికి సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
డాగ్ స్క్వాడ్ ప్రొద్దుటూరుకి చేరుకొని తనిఖీ చేస్తున్నారు. యువకుడు హత్యకు గురై ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువకుడి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: పొలంలో గుళికలు చల్లుతుండగా 10 మందికి అస్వస్థత..ఇద్దరి పరిస్థితి విషమం