ETV Bharat / state

వేసవి వినోదం... 'గ్రామీణాభివృద్ధి'తో విజ్ఞానం - వేసవి తరగతులు

వేసవి వచ్చిందంటే ఆటపాటలు, సంతోషాలు, సరదాలు. ప్రభుత్వ విద్యార్థులకు సెలవులంటే ఇదే ఇక. కానీ వీటన్నింటినీ కలగలిపిన విజ్ఞానాన్ని అందించాలని భావించింది గ్రామీణాభివృద్ధి సంస్థ. కార్పొరేట్ స్థాయిలో శిక్షణనిస్తూ.. వారిలో నైపుణ్యానికి పదును పెడుతోంది.

వేసవిలో శిక్షణా తరగతులు
author img

By

Published : May 27, 2019, 7:58 AM IST

వేసవిలో శిక్షణా తరగతులు

గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులకు చదువు తప్ప ఇతర రంగాల్లో పెద్దగా ప్రవేశం ఉండదు. సౌకర్యాలు అందుబాటులో ఉండక పోవడం, తదితర కారణాల వల్ల గ్రామీణ విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్యను అందుకోలేకపోతున్నారు. అలాంటి వారికి చేయూతనిస్తూ వేసవి సెలవులను వినియోగించుకునేలా గ్రామీణాభివృద్ధి సంస్థ అండగా ఉంటుంది.
అత్యాధునిక శిక్షణ...

కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్ ఉప్పలపాడులో మాయలూరు పార్వతి రామకృష్ణారెడ్డి గ్రామీణాభివృద్ధి సంస్థ విద్యార్థులకు నైపుణ్య తరగతులను నిర్వహిస్తోంది. అత్యాధునిక వసతులు, అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ వేసవి సెలవులను ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా శిక్షణ ఇప్పిస్తోంది. కంప్యూటర్ పరిజ్ఞానం, మట్టితో, కాగితాలతో బొమ్మలు తయారు చేయడం, డ్రాయింగ్ , నృత్యాలు ఇలా అన్ని రంగాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు.

హైదరాబాద్​ నుంచి ఉపాధ్యాయులు...
విద్యార్థులకు శిక్షణ ఇప్పించేందుకు ఆ సంస్థ నిర్వాహకులు హైదరాబాద్​ నుంచి ముగ్గురు ఉపాధ్యాయులను రప్పించారు. మెుత్తం ఎనిమిది మంది టీచర్లు వీరికి శిక్షణ ఇస్తున్నారు. ఉప్పలపాడు , జమ్మలమడుగు, మోరగుడి, కమ్మవారిపల్లె, తదితర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు.

వేసవిని వినోదంతో మిళితం చేస్తూనే... విజ్ఞానాన్ని జోడిస్తున్న మాయలూరు పార్వతి రామకృష్ణారెడ్డి గ్రామీణాభివృద్ధి సంస్థ హ్యాట్సాప్.

ఇదీ చదవండీ: వేసవిలో ఈత పోటీలు భలే మజా...

Vadodara (Gujarat), May 26 (ANI): A social activist from Gujarat's Vadodara is translating Prime Minister Narendra Modi's 'Beti Bachao, Beti Padhao' slogan into reality. 26-year-old Nishita Rajput is helping poor girls get free education by crowd sourcing funds for the last eight years, and she has been successful in getting more than 10,000 underprivileged girls to school. Last year, she had raised Rs 69 lakh against her target of one crore, and even this year, she has already raised Rs 32 lakh. "I am working on the 'Beti Bachao, Beti Padhao' slogan for the last eight years, and my target last year was one crore, but I received cheques worth Rs 69 lakh. And this year too, my target was one crore, and I have already received cheques worth Rs 32 lakh. So, I am hopeful of achieving the target," Nishita told ANI. Nitisha also expressed hope of establishing a school of her own where she can provide free education to poor girl child at a bigger level.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.