ETV Bharat / state

Student Suspicious Death: స్కూల్​లో విద్యార్థి అనుమానాస్పద మృతి.. కొట్టి చంపేశారంటున్న తల్లిదండ్రులు - సోహిత్ మృతి

Student Sohit Dead: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థి అనుమానాస్పద మృతి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న సోహిత్ శనివారం ఉదయం మృతి చెందాడు. బాలుని మృతికి నిరసనగా అతని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట నిరసన చేపట్టగా.. అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనపై స్పందించిన విద్యాశాఖ పాఠశాలకి ప్రభుత్వ గుర్తింపు రద్దు చేసి సీజ్ చేసింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 2, 2023, 7:27 AM IST

ఆరో తరగతి విద్యార్థి మృతి.. పాఠశాల సిబ్బంది కొట్టి చంపేశారని తల్లిదండ్రుల ఆరోపణ

Student Sohit Dead in school Hostel : ఆడుతూ పాడుతూ జీవించాల్సిన ఆరో తరగతి విద్యార్థి మృతితో వైఎస్సార్ జిల్లా ఉలిక్కిపడింది. పులివెందులకు చెందిన నాగరాజు, లలిత దంపతుల కుమారుడు సోహిత్ ఖాజీపేట మండలం కొత్తపేట వద్దగల బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. పాఠశాల హాస్టల్‌లోనే ఉంటున్న సోహిత్ శనివారం ఉదయం 5 గంటలకు తల్లిండ్రులకు ఫోన్ చేసి కడుపు నొప్పిగా ఉందని తెలిపాడు. కడపలోని బంధువులు పాఠశాలకు వచ్చేటప్పటికే సోహిత్‌ని బయట పడుకోబెట్టారు. హుటాహుటిన చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే సోహిత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

పాఠశాలపై కర్రలు, రాళ్లతో దాడి : సోహిత్ శరీరంపై పలు చోట్ల కమిలిన గాయాలు ఉండటంతో హాస్టల్ సిబ్బందే తమ కొడుకుని కొట్టి చంపారంటూ మృతదేహంతో పాఠశాల వద్దకు వచ్చారు. సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో గేటు దూకి లోపలికి వెళ్లి వారిపై చేయి చేసుకున్నారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. పులివెందుల నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చేసరికి పాఠశాల యాజమాన్యం అక్కడి నుంచి పరారైంది. దీంతో పాఠశాల ఆవరణలో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాలు కూడా వీరికి మద్దతు పలికాయి. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. మైదుకూరు సీఐ నరేంద్రరెడ్డి ఓ వృద్ధుణ్ని పట్టుకొని నెట్టేయడంతో ఆయన కింద పడ్డారు.

'జాయిన్ చేసి రెండు వారాలు అయ్యింది. ఉదయం ఐదు గంటలకు ఫోన్ చేసి కడుపునొస్తుందని చెప్పాడు. రాత్రి రాని కడుపు నొప్పి ఉదయానికి ఎలా వచ్చింది? సిక్ రూమ్​కి కూడా వెళ్లలేదు. మేము జాయిన్ చేసినప్పుడు గాయాలు లేవు. మా బాబు శరీరంపై గాయాలు ఎలా వచ్చాయి. పోస్ట్​మార్టంకి తీసుకెళ్తామంటున్నారు. అక్కడ మానిప్యులేట్ చేస్తారు.'- బ్రహ్మయ్య, సోహిత్ చిన్నాన్న

పాఠశాల మూసివేతకు ఆదేశాలు.. కమిటీ ఏర్పాటు : పాఠశాల వద్ద నుంచి జాతీయ రహదారి వద్దకు వెళ్లి సోహిత్‌ బంధువులు ఆందోళన కొనసాగించారు. ఇలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడంతో విద్యార్థి మృతిపై విద్యాశాఖ స్పందించింది. సోహిత్ మృతికి కారణమైన బీరం శ్రీధర్‌రెడ్డి ప్రైవేటు పాఠశాలకి ప్రభుత్వ గుర్తింపు రద్దు చేసి సీజ్ చేస్తున్నట్లు డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్ర విచారణ చేయడానికి ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించారు. మధ్యాహ్న భోజన పథకం అసిస్టెంట్ డైరెక్టర్, ఇద్దరు ఎమ్​ఈఓలు, తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్‌తో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయనుందని తెలిపారు. పాఠశాల రద్దు గుర్తింపు రద్దు చేయడంతో విద్యార్థులను ఎక్కడ చేర్పించాలనే దానిపై తల్లిదండ్రులతో కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కఠిన శిక్ష విధించాలని డిమాండ్: ముక్కుపచ్చలారని సోహిత్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ అతని బంధువులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

'తప్పు చేయకుంటే పోలీస్ స్టేషన్​లో ఎందుకు లొంగిపోయారు. మాకు సీసీ టీవీ పుటేజ్​ కుడా చూపించలేదు. డబ్బులు సంపాదించుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మాకు న్యాయం కావాలి.'- నాగరాజు, సోహిత్ తండ్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.