ETV Bharat / state

టీటీడీ బంగారు బిస్కెట్ చోరీ కేసు - విచారణలో విస్తుపోయే విషయాలు - TTD PARAKAMANI GOLD COIN THEFT CASE

తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి బంగారు బిస్కెట్ దొంగతనంలో కేసు కొత్త మలుపు - ఇప్పటి వరకూ సుమారు 46 లక్షల విలువ గల బంగారు బిస్కెట్స్ చోరీ

TTD PARAKAMANI GOLD COIN THEFT CASE
TTD PARAKAMANI GOLD COIN THEFT CASE (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 14, 2025, 8:32 AM IST

TTD PARAKAMANI GOLD COIN THEFT CASE : తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి బంగారు బిస్కెట్ దొంగతనంలో కేసు కొత్త మలుపు తిరిగింది. జనవరి 11వ తేదీన తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచులయ్య పరకామణి భవనంలో బంగారు చోరీ ఘటనలో పట్టుబడ్డారు. అతడిని విచారించగా మరిన్ని కీలక విషయాలు తెలిశాయి. ఇప్పటి వరకూ అతడు బంగారు నిల్వ ఉంచే గది నుంచి సుమారు 46 లక్షల విలువ గల బంగారు బిస్కెట్స్​ను చోరీ చేసినట్లు తేలింది.

ఈ కేసులో పెంచలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. 100 గ్రాముల బంగారు బిస్కెట్ తో పాటు గతంలో మరో 555 గ్రాముల బంగారు బిస్కెట్స్, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండిని దొంగలించినట్లు పోలీసులు కనుగొన్నారు. కాగా ఈ చోరిలో నిందితుడు పెంచలయ్య 100 గ్రాముల బంగారు బిస్కెట్​ను ట్రాలీకి ఉన్న పైపులలో ఉంచారు. తనిఖీల్లో భాగంగా టీటీడీ భద్రతా అధికారులు బంగారు బిస్కెట్​ను గుర్తించారు. బంగారు బిస్కెట్​ను చూసిన భద్రత సిబ్బంది అది ట్రాలీలోకి ఎలా వచ్చిందనే అనుమానంతో పైఅధికారులకు సమాచారం అందజేశారు.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన టీటీడీ విజిలెన్స్ అధికారులు బంగారు బిస్కెట్​ను దొంగలించింది యూనియన్ బ్యాంక్ కాంట్రాక్టు ఉద్యోగి పెంచలయ్యగా సీసీ కెమెరా ద్వారా రెండు గంటల్లో గుర్తించారు. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య తిరుమల శ్రీవారి పరకామణిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా గత రెండు సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పరకామణిలోని బంగారం నిల్వ ఉంచే గదిలోని గోల్డ్ వస్తువులను దొంగిలించినడం మొదలు పెట్టాడు.

పెంచలయ్య తీరుపై అనుమానం రావడంతో టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది నిఘా పెట్టారు. జనవరి 11వ తేదీన మధ్యాహ్నం గోల్డ్‌ స్టోరేజ్‌ గదిలో ఉన్న 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను దొంగిలించి ట్రాలీకి ఉన్న పైపులలో దాచిపెట్టాడు. తనిఖీల సమయంలో భద్రతా సిబ్బంది దీనిని గుర్తించగా వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.

విజిలెన్స్‌ సిబ్బంది ఫిర్యాదు మేరకు తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు పెంచలయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పెంచలయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సమయంలో గతంలో పరకామణిలో చేసిన చోరీల విషయం సైతం వెలుగులోకి వచ్చింది. పెంచలయ్య కాజేసిన స్వామివారి బంగారు వెండిని స్వాధీనం చేసుకున్నారు.

తిరుమల పరకామణిలో బంగారం చోరీ - పట్టుబడిన కాంట్రాక్టు ఉద్యోగి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.