ETV Bharat / state

సూర్యలంకలో బీచ్​ రిసార్ట్​ బుక్ చేస్తున్నారా? - తస్మాత్ జాగ్రత్త - FAKE TOURISM DEPARTMENT WEBSITE

బాపట్లకు సమీపంలోని సూర్యలంక బీచ్‌ రిసార్ట్స్​కి భారీగా డిమాండ్‌ - దీనిని 'క్యాష్'​ చేసుకుంటున్న పలువురు మోసగాళ్లు

Fake Tourism Department Website
Fake Tourism Department Website (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 14, 2025, 9:02 AM IST

Fake Tourism Department Website: సైబర్​ నేరగాళ్లు రోజుకో కొత్త రూటు మారుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే వారి బుట్టలో పడేలా చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా పర్యాటక శాఖకు చెందిన ఫేక్ వెబ్​సైట్​ని సృష్టించి దోచుకుంటున్నారు. ఇదే విధంగా పలువురు మోస పోయామంటూ ముందుకు వచ్చారు.

బాపట్లకు సమీపంలోని సూర్యలంకలోని టూరిజం డిపార్ట్​మెంట్ బీచ్‌ రిసార్ట్స్​కు భారీగా డిమాండ్ ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది సైబర్​ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్‌లతో పర్యాటకులను మోసగిస్తున్నారు. హైదరాబాద్‌ తదితర దూర ప్రాంతాల నుంచి ఇటీవల కొంతమంది పర్యాటకులు సూర్యలంక బీచ్‌కు వెళదామని నిర్ణయించారు. దీంతో టూరిజం డిపార్ట్​మెంట్​కి చెందిన రిసార్ట్‌లోని కాటేజీలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నారు.

అయితే వారు బుక్‌చేసుకుంది నకిలీ వెబ్‌సైట్‌ అని తెలియక వేల రూపాయలు నష్టపోయారు. తాజాగా ఇద్దరు పర్యాటకులు ఇదే విధంగా మోసపోయారు. హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్, ఖమ్మంకు చెందిన పీటర్‌ వారి కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి సంక్రాంతి పండగ సందర్భంగా సూర్యలంక బీచ్‌కు వెళదామని అనుకున్నారు. పర్యాటక శాఖ రిసార్ట్‌లోని కాటేజీలను ఆన్‌లైన్​లో బుక్‌ చేశారు. దీనికి ఒక్కొక్కరు 15 వేల రూపాయల చొప్పున మొత్తం 30 వేల రూపాయలు చెల్లించారు.

వీరంతా సోమవారం సూర్యలంకలోని బీచ్‌ రిసార్ట్‌కు వెళ్లి, తాము అక్కడ గదులు బుక్‌ చేసుకున్నట్లు తమ ఫోన్​లకు వచ్చిన మెసేజ్​లను రిసార్ట్‌ మేనేజర్‌ అశోక్‌కు చూపించారు. అయితే అతడు పరిశీలించి, పర్యాటక శాఖ వెబ్‌సైట్‌లో వారి పేర్లతో ఎలాంటి గదులు బుక్‌ కాలేదని తెలిపారు. దీంతో తాము మోసపోయినట్లు బాధితులు గుర్తించారు. మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారికి సూచించినట్లు పర్యాటక శాఖ మేనేజర్‌ తెలిపారు.

గతంలో ఇదే పరిస్థితి: పది రోజుల క్రితం కూడా హైదరాబాద్‌కు చెందిన ఓ విలేకరి ఇదే తరహాలో సూర్యలంక బీచ్‌ రిసార్ట్‌లో గది కోసం ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నారు. ప్రస్తుతం జరిగిన విధంగానే ఫేక్ వెబ్‌సైట్‌ బారినపడి రూ.7,800 పోగొట్టుకున్నారని చెప్పారు. వీటన్నింటినీ టూరిజం డిపార్ట్​మెంట్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పర్యాటక శాఖ మేనేజర్‌ తెలిపారు.

అనంతపురంలో అడ్డంగా బుక్కైన SBI మేనేజర్ - దిల్లీ వెళ్లినా నో యూజ్

'మా బాధ ఎవరికి చెప్పుకోవాలి' - బాధితుల డబ్బు మరో బాధితుడికి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.