Ongole Student Chit Chat With Prime Minister : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన 'పరీక్షా పే చర్చ'లో రాష్ట్రం నుంచి ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ బాలికోన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని నగరికంటి సాయి సహస్ర పాల్గొన్నారు. దిల్లీలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె ప్రధానితో ముచ్చటించారు. చర్చలో భాగంగా ప్రకృతి, పచ్చదనానికి సంబంధించి ప్రధానిని ఆమె ప్రశ్నించారు.
మోదీ స్పందిస్తూ ప్రకృతిలో మొక్క తల్లితో సమానమన్నారు. మొక్కలు నాటి సంరక్షించుకోవడం అంటే తల్లిని గౌరవించుకోవడమేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమం గురించి వివరించారు. విద్యార్థినితో పాటు పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయురాలు సహాయకురాలిగా దిల్లీ వెళ్లారు.
'మీతో మీరే పోటీ పడండి- ఇతరులతో కాదు'- విద్యార్థులకు మోదీ సలహా
'అమ్మను చూస్తే సమయపాలన ఎలా చేయాలో తెలుస్తుంది'.. పరీక్ష పే చర్చలో విద్యార్థులతో మోదీ