సెయిల్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మించాలనే డిమాండ్‌తో జమ్మలమడుగు నుంచి విద్యార్థి ఐకాస చేపట్టిన పాదయాత్ర బుధవారం మైదుకూరు చేరుకుంది. విద్యార్థి ఐకాస నాయకుల వెంట నడిచి మైదుకూరు విద్యార్థులు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
కేంద్రం వెంటనే కడపలో ఉక్కు కర్మాగారం నిర్మించేలా ప్రకటన చేయాలన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: