దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు పరచిన ఉచిత విద్యుత్‌కు జగన్ తూట్లు పొడుస్తున్నారని... సీపీఐ, సీపీఎం నేతలు ఆరోపించారు. నీటి మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించే ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. కడప కలెక్టరేట్ ఎదుట ఇరు పార్టీల నేతలు నిరసన చేపట్టారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీటి మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించడం వల్ల రైతులు నష్టపోతారని ఆరోపించారు. ఇంత కాలంగా సుభిక్షంగా ఉన్న రైతన్న.. ఈ విధానంతో రోడ్డున పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణం మీటర్ల విధానాన్ని రద్దు చేయకపోతే...రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం ఆందోళన చేస్తుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి: